సూపర్ స్టార్ మహేష్, దర్శకధీరుడు రాజమౌళి కాంబినేషన్ పాన్ వరల్డ్ మూవీ #SSMB29. మూవీ కోసం అభిమానులతో పాటు సినీ ప్రేక్షకులు ఎంతగానో ఎదురుచూస్తున్నారు. ఈ క్రమంలో సినిమా టైటిల్, గ్లింప్స్ విడుదల చేసేందుకు #GlobTrotter అనే పేరుతో పెద్ద ఈవెంట్ కు మేకర్స్ ప్లాన్ చేశారు. తాజాగా హీరోయిన్ ప్రియాంక చోప్రా ఫస్ట్ లుక్ ను విడుదల చేశారు. పసుపు కలర్ శారీలో గన్ కాలుస్తున్న ప్రియాంక పోస్టర్ ను వదిలారు. ఇందులో ఆమె మందాకిని పాత్రలో నటిస్తున్నట్లు తెలిపారు.

