మంగళవారం ముగిసిన బీహార్ అసెంబ్లీ ఎన్నికల్లో ఎన్‌డీఏ అధికారంలోకి వస్తుందని ఎగ్జిట్ పోల్స్ అంచనా వేయడంతో దేశీయ సూచీలు భారీ లాభాలను ఆర్జిస్తున్నాయి. అలాగే భారత్‌పై విధించిన సుంకాలను భారీగా తగ్గించబోతున్నామని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రకటించడం కూడా సూచీలకు కలిసి వచ్చింది. అలాగే అంతర్జాతీయంగా సానుకూల సంకేతాల కూడా కలిసి రావడంతో ప్రస్తుతం సెన్సెక్స్, నిఫ్టీ లాభాల్లో కదలాడుతున్నాయి. ఉదయం 10:30 గంటల సమయంలో సెన్సెక్స్ 567 పాయింట్ల లాభంతో 84, 439 వద్ద కొనసాగుతోంది

