ఇటీవల సోషల్ మీడియాలో, కొన్ని వెబ్‌సైట్లలో విస్తృతంగా టాటా (Tata) కంపెనీ తక్కువ ధరలో కొత్త టూవీలర్ వాహనాలను విడుదల చేయబోతోందనే వార్తలు వైరల్ అవుతున్నాయి. వార్తల్లో ఎటువంటి నిజం లేదని టాటా మోటార్స్ స్పష్టతనిచ్చింది.అలాంటి మోసపూరిత యాడ్స్‌ను నమ్మవద్దని వినియోగదారులకు సూచించింది. తమ అధికారిక వెబ్‌సైట్లను మాత్రమే పరిశీలించాలని కోరింది.

