ఎగ్జిట్ పోల్స్ అంచనాల కన్నా మెరుగైన ఫలితాలు సాధిస్తామని బిహార్ ఉపముఖ్యమంత్రులు సామ్రాట్ చౌదరీ, విజయ్ కుమార్ సిన్హా విశ్వాసం వ్యక్తం చేశారు. ఎన్డీఏ ఓటింగ్ షేర్ కూడా 50శాతం దగ్గర్లో ఉంటుందని ఆశాభావం వ్యక్తం చేశారు.
మూడింట రెండొంతుల మెజారిటీతో బిహార్లో ఎన్డీఏ కూటమి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయబోతుందని ధీమా వ్యక్తం చేశారు. ఎగ్జిట్ పోల్స్ కన్నా ఫలితాల్లో ఎక్కువగా వస్తాయి. మా ఓటింగ్ షేర్ కూడా 50 శాతం దాటుతుందని అనుకుంటున్నాం. అని సామ్రాట్ చౌదరీ అన్నారు.

