ఓటర్ల జాబితా స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ (SIR)పై పశ్చిమబెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ మరోసారి విరుచుకుపడ్డారు. కేంద్రం, ఎన్నికల కమిషన్‌పై విమర్శలు గుప్పించారు. డీమోనిటైజేషన్, ఎస్ఐఆర్ డ్రైవ్‌ను ఒకేగాట కడుతూ మొదటిది ‘నోట్‌బందీ’ అయితే, రెండవది ‘ఓట్‌బందీ’ అని అన్నారు. ఎస్ఐఆర్ ప్రక్రియను ఉపసంహరించుకోవాల్సిందిగా ఈసీని కోరారు. ఎస్ఐఆర్ను విమర్శించినందుకు బీజేపీ తనను జైలుకు పంపినా, గొంతు కోసినా ప్రజల ఓటు హక్కులను మాత్రం ఊడలాక్కోలేరని అన్నారు.

