ఆస్ట్రియా నుంచి ఢిల్లీకి విమానంలో ప్రయాణిస్తున్న సమయంలో ఓ వ్యక్తి ఢిల్లీ గగనతలాన్ని కెమెరాలో రికార్డు చేసిన వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్‌గా మారింది. వీడియోలో కనిపించిన దాని ప్రకారం, వియన్నాలో వాయు కాలుష్యం అసలు లేనే లేదు. దీంతో, విమానం నుంచి కెమెరాతో రికార్డు చేస్తుంటే కింద నగరం అందాలన్నీ స్పష్టంగా రికార్డు అయ్యాయి. ఇక వీడియో రెండో భాగంలో ఢిల్లీ గగనతలాన్ని చూపించారు. ఢిల్లీ గాల్లో కాలుష్యం విపరీతంగా పెరగడంతో విమానంలో నుంచి అంతా మసకగా కనిపించింది.

