భారీ ఖర్చుతో కూడుకున్న వైద్య సేవలను నిరుపేదలకు ఉచితంగా అందిస్తున్న శంకర కంటి ఆసుపత్రి సేవలు అమూల్యమైనవని సీఎం పేర్కొన్నారు. నంబూరులో శంకర కంటి ఆసుపత్రి నూతన భవనాన్ని కంచి పీఠాధిపతి శ్రీశ్రీశ్రీ విజయేంద్ర సరస్వతీతో కలిసి ప్రారంభించారు. శంకర కంటి ఆసుపత్రి దాదాపు 5 దశాబ్ధాలుగా ఎంతో మంది నిరుపేదలకు అత్యుత్తమ వైద్య సేవలను ఉచితంగా అందించడం అభినందనీయమని. అనారోగ్యమే నిజమైన పేదరికమన్నారు.
ప్రజారోగ్యాన్ని కాపాడేందుకు శంకర్ కంటి ఆసుపత్రి చేస్తున్న కృషిని అభినందిస్తున్నానని తెలిపారు.

