బిహార్ ప్రజలు ఇప్పటికీ మార్పును కోరుకోకుంటే వారితోనే ఉంటూ మరో ఐదేళ్లు పనిచేస్తూ వెళ్తాం. ప్రభుత్వంలో చేరే ప్రసక్తి కూడా లేదు. జనసురాజ్ సొంత బలంపైనే ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తుంది. బలం లేకుంటే ప్రతిపక్షంలో కూర్చుంటుంది. అవసరమైతే మరోసారి ఎన్నికకు వెళ్తాం. మేము బీజేపీకి వ్యతిరేకం. సైద్ధాంతికంగా వారితో మేము విభేదిస్తున్నాం’ అని ఆదివారం నాడు ఒక ఇంటర్వూలో ప్రశాంత్ కిషోర్ తెలిపారు. జన్సురాజ్ నిర్మాణానికి తాము ఎంతో కష్టపడ్డామని, మార్పు ఇప్పటికే కనిపిస్తోందని, ఫలితాల కోసం వేచిచూద్దామని ప్రశాంత్ కిషోర్ అన్నారు.

