ప్రముఖ రాజకీయ పార్టీ జనసేన అధికారిక సోషల్ మీడియా హ్యాండిల్ ‘X’ (గతంలో ట్విట్టర్) ఖాతా హ్యాక్‌కు గురైంది. శనివారం రాత్రి నుంచి ఈ ఖాతాలో అనుమానాస్పద కార్యకలాపాలు గమనించిన పార్టీ శ్రేణులు, అభిమానులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. హ్యాక్ చేసిన అనంతరం ఖాతా ప్రొఫైల్ లోగోతో పాటు కవర్ ఫోటో తొలగించారు సైబర్ నేరగాళ్లు. అంతేగాకుండా పార్టీకి ఏ మాత్రం సంబంధం లేని కొన్ని డిజిటల్ లావాదేవీల కంపెనీల ట్వీట్లను ఈ ఖాతా నుంచి రీపోస్ట్ చేశారు.

