టిడిపి ఎమ్మెల్యే సీటు కోసం రైల్వేకోడూరు టికెట్ ఇప్పిస్తాననిరూ.7 కోట్లు వసూలు చేశారని ఆ పార్టీ మహిళా నేత మాధవి ఆరోపణలు చేశారు. టిటిపి నేత వేమన సతీష్ తనను మోసం చేశాడని సదరు మహిళ మీడియా ముందు కన్నీంటిపర్యంతమయ్యారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, మంత్రి లోకేష్ అందరూ సతీష్ కు తెలుసునని చెప్పి తనని మోసం చేశాడన్నారు. డబ్బు అడిగితే కేసులు పెడతామని బెదిరిస్తున్నాడని, తనకు న్యాయం చేయాలని బాధితురాలు వేడుకున్నారు.

