బీహార్ ఎంపీ రెండు చేతుల వేళ్లకు ఎన్నికల సిరా గుర్తులున్నాయి. మీడియాకు ఆమె తన రెండు చేతి వేళ్లను చూపించింది. ఈ వీడియో క్లిప్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. దీంతో ఆ ఎంపీ రెండు ఓట్లు వేసినట్లు ఆరోపణలు వెల్లువెత్తాయి. బీహార్ అసెంబ్లీ ఎన్నికల తొలిదశ పోలింగ్ గురువారం జరిగింది. ఎన్డీయే కూటమికి చెందిన లోక్ జనశక్తి పార్టీ (రామ్ విలాస్) సమస్తిపూర్ ఎంపీ శాంభవి చౌదరి తన కుటుంబంతో కలిసి ఓటు వేశారు.

