నేటితో భారత్లో హాకీ ప్రయాణానికి సరిగ్గా 100 ఏళ్లు పూర్తయిన సందర్భంగా, ఈ వేడుకలను హాకీ ఇండియా (HI) దేశవ్యాప్తంగా గ్రాండ్ లెవెల్లో ప్లాన్ చేసింది. దిల్లీలోని మేజర్ ధ్యాన్ చంద్ నేషనల్ స్టేడియంలో ఉదయం 8:30 గంటల నుంచే ప్రధాన కార్యక్రమం మొదలైంది. ఇది దిల్లీకే పరిమితం కాదు, దేశంలోని 550కి పైగా జిల్లాల్లో ఏకకాలంలో ఈ వేడుకలు జరుగుతున్నాయి. ఈ ఒక్కరోజే 1400లకు పైగా హాకీ మ్యాచ్‌లు నిర్వహించడం, అందులో 36,000 మందికి పైగా ప్లేయర్లు పాల్గొనడం ఒక రికార్డు.

