ఉమెన్స్ ప్రీమియర్ లీగ్ (డబ్ల్యూపీఎల్) 2026 మెగా వేలానికి ముందు ఢిల్లీ క్యాపిటల్స్ రిటెన్షన్ జాబితాను ప్రకటించింది. జీఎంఆర్, జేఎస్డబ్ల్యూ గ్రూపుల ఆధీనంలోని ఈ జట్టు ఐసీసీ వరల్డ్ కప్ విజేతలైన జెమీమా రోడ్రిగ్స్, షఫాలీ వర్మలను
జట్టుతోను ఉంచుకుంది. అయితే, మరో ఛాంపియన్ ప్లేయర్ శ్రీ చరణికి షాక్ ఇస్తూ వేలంలోకి వదిలిపెట్టింది. రిటెన్షన్ జాబితాలో మారిజానే కాప్, అన్నాబెల్ సదర్లాండ్, నికి ప్రసాద్ లను కొనసాగించింది. ఈ ఐదుగురు గత మూడు సీజన్లలో ఢిల్లీ జైత్రయాత్రలో కీలక పాత్ర పోషించారు.

