ఉమెన్స్ ప్రీమియర్ లీగ్ (WPL) 2026 ఎడిషన్‌కు ముందు ముంబై ఇండియన్స్ మహిళల జట్టు తమ రిటైన్డ్ ప్లేయర్ల జాబితాను ప్రకటించింది. జనవరిలో జరగనున్న ఈ టోర్నమెంట్‌లో తొలిసారి మెగా వేలం ఫార్మాట్‌లో పోటీలు జరగనున్నాయి. అయితే, తమ రిటెన్షన్ తోనే ముంబై ఇండియన్స్ జట్టు ప్రత్యర్థి జట్లకు దడపుట్టిస్తోంది. 2023, 2025 సీజన్లలో ఛాంపియన్‌గా నిలిచిన ముంబై ఇండియన్స్ మహిళల జట్టు ఈసారి కూడా సమతుల్యమైన జట్టుతో ముందుకు సాగేందుకు సిద్ధమైంది.

