జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో నువ్వా-నేనా అన్నట్లు త్రిముఖ పోటీ జరుగుతున్న సమయంలో తెలంగాణ జనసేన పార్టీ బిజెపికి మద్దతు ప్రకటించింది. తెలంగాణ జనసేన పార్టీ అధ్యక్షుడు ఎన్. శంకర్ గౌడ్‌ను మంగళవారం సాగర్ సొసైటీలో బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు ఎన్. రాంచందర్ రావు, కేంద్ర బొగ్గు గనుల శాఖ మంత్రి జి. కిషన్ రెడ్డి, ముఖ్య నాయకులతో మంతనాలు జరిపారు. బిజెపి అభ్యర్థికి మద్దతుగా ఒక రోజు రోడ్-షో, బహిరంగ సభకు హాజరుకావాల్సిందిగా పవన్ కళ్యాణ్‌ను ఆహ్వానించాలని బిజెపి నాయకులు నిర్ణయించారు.

