జమ్మూ కాశ్మీర్‌లోని ఉధంపూర్‌లో విధులు నిర్వర్తిస్తున్న ఆర్మీ జవాన్ జిగ్నేష్ చౌదరి.. గుజరాత్‌లోని సబర్మతిలో ఉన్న తన ఇంటికి వెళ్లేందుకు సబర్మతి ఎక్స్‌ప్రెస్ ఎక్కాడు. అయితే, బెడ్‌షీట్ విషయంలో రైలు అటెండర్‌తో జవాన్‌కు గొడవ జరిగింది. ఇద్దరి మధ్య మాటామాట పెరిగడంతో కోపంలో రెచ్చిపోయిన రైలు అటెండర్ కత్తితో జవాన్ పై దాడి చేశాడు. దీంతో తీవ్రంగా గాయపడిన జవాన్ మృతి చెందాడు. సమాచారం అందుకున్న రాజస్థాన్ బికనీర్ రైల్వే పోలీసులు
నిందితుడి జుబైర్ మెమన్ ను అరెస్టు చేశారు.

