జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల ప్రచారంలో భాగంగా హైదరాబాద్ బోరబండలో కేటీఆర్ రోడ్ షో నిర్వహించారు. ప్రతి పేద వాడికి మేం అండగా నిలబడతాం.. బుల్డోజర్లకు అడ్డంగా పడుకుంటామని స్పష్టం చేశారు. సునీతమ్మకు అండగా నేనున్నా.. కేసీఆర్ ఉన్నారు.. పక్కనే తెలంగాణ భవన్ ఉందని తెలిపారు. అర్ధరాత్రి ఫోన్ చేసినా అర్దగంటలో మీ వద్దకు వస్తామని స్పష్టం చేశారు. కాంగ్రెస్ వాళ్లు భయపెడితే.. మేం వచ్చి వాళ్ల సంగతి తేలుస్తామని స్పష్టం చేశారు.
      
