తమిళనాడులోని కరూర్‌లో తమిళగ వెట్రి కళంగం (TVK) చీఫ్ విజయ్ ఇటీవల నిర్వహించిన ర్యాలీలో తొక్కిసలాటకు సంబంధించి సీబీఐ (CBI) అధికారులు సోమవారంనాడు టీవీకే పార్టీ కార్యాలయానికి వెళ్లారు. ఘటనకు సంబంధించిన వివరాలను ఆరా తీశారు. కనూర్ తొక్కిసలాటకు సంబంధించిన సీసీటీవీ ఫుటేజ్ వంటి వివరాలను అడిగినట్టు తెలిపారు. ‘అధికారులు వివరాల కోసం వచ్చారు, ఇంటరాగేషన్ కోసం కాదు. వ్యక్తిగతంగా సమన్లు జారీ చేసి వివరాలు ఇవ్వాలని కోరారు. ఆ వివరాలు అందజేసేందుకు మేము అంగీకరించాం’ అని చెప్పారు.
      
