బీహార్ అసెంబ్లీ ఎన్నికల ప్రచారం వేడెక్కుతున్న తరుణంలో.. ఏఐఎంఐఎం అధినేత, ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ ఆర్జేడీ నాయకుడు తేజస్వీ యాదవ్పై తీవ్రస్థాయిలో మండిపడ్డారు. తనను ‘అతివాది’ (ఎక్స్ట్రీమిస్ట్) అని పిలిచిన తేజస్వీ.. ఆ పదాన్ని ‘పాకిస్థాన్ నుంచి తెచ్చుకున్నారా” అంటూ విమర్శనాస్త్రాలు సంధించారు. తేజస్వీ వ్యాఖ్యలపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ.. “హే బాబూ, ‘ఎక్స్ట్రీమిస్ట్’ని ఒక్కసారి ఇంగ్లీషులో రాసి చూపించు” అంటూ ఎద్దేవా చేశారు.

