మహిళ క్రికెట్ లో విశ్వ విజేతగా నిలిచిన క్రికెట్ టీమ్ కు రూ.51 కోట్ల రూపాయలు ప్రైజ్ మనీ ఇవ్వబోతోంది. ఇంతటి మొత్తాన్ని పురుషుల జట్లకు కూడా ఇప్పటివరకూ బీసీసీఐ ఇవ్వలేదు. భారత మహిళల విజయానికి ఇంకా ఎన్నో సంస్థలు భారీగా క్యాష్ రివార్డులు అందించేందుకు ముందుకు వస్తున్నాయి. ఈ టోర్నీలో విజేత, రన్నరప్, ఇతర జట్ల కోసం మొత్తంగా ఐసీసీ 13.88 మిలియన్ డాలర్లు (రూ.123 కోట్లు) ప్రైజ్ మనీ పూల్‌ను ఏర్పాటు చేసిన సంగతి తెలిసిందే.

