రిలయన్స్ గ్రూప్ ఛైర్మన్ అనిల్ అంబానీపై ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ చర్యలు చేపట్టింది. ముంబైలోని పాలి హిల్ ప్రాంతంలో ఉన్న ఇల్లు, ఢిల్లీలోని రిలయన్స్ సెంటర్ వీటితా పాటు ఢిల్లీ, నోయిడా, ముంబై, గాజియాబాద్, ఠాణె, పుణె, చెన్నై,
హైదరాబాద్, తూర్పు గోదావరిలో అనిల్ అంబానీ కంపెనీలకు చెందిన పలు ఇండ్లు, వాణిజ్య ఆస్తులు అటాచ్ చేసిన ఆస్తుల జాబితాలో ఉన్నట్లు తెలుస్తోంది. అటాచ్ చేసిన ఆస్తులు మొత్తం విలువ రూ. 3084 కోట్లుగా ఉంటాయని అధికార వర్గాలు పేర్కొన్నాయి.

