భారత చెస్ దిగ్గజం విశ్వనాథన్ ఆనంద్‌కు అతిపెద్ద గౌరవం లభించింది. మనదేశపు తొలి గ్రాండ్‌మాస్టర్ అయిన ఆనంద్ పేరుతో ట్రోఫీని నిర్వహించాలని ఫిడే నిర్ణయించింది. భారత్ వేదికగా జరుగుతున్న వరల్డ్ చెస్ కప్ టోర్నీకి ఆనంద్ పేరు పెట్టింది. చదరంగంలో ఆయన కృషి, సాధించిన విజయాలకు గుర్తింపుగా ఈ గౌరవం కల్పిస్తున్నట్టు భారత చెస్ సమాఖ్య అధ్యక్షుడు నితిన్ నారంగ్ వెల్లడించారు. పురాతన ఆటలో ఒకటైన చదరంగం వైభవాన్ని ఈ ట్రోఫీ ప్రతిబింబిస్తుంది అని వెల్లడించారు.

