 
		సన్యాసినిగా మారిన బాలీవుడ్ నటి మమతా కులకర్ణి సంచలన వ్యాఖ్యలు చేశారు. భారత్‌కు మోస్ట్ వాంటెడ్ డాన్‌గా ఉన్న దావూద్ ఇబ్రహీం గురించి వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. దావూద్ ఇబ్రహీం చాలా మంచి వ్యక్తి అని అన్నారు. అంతేకాదు దావూద్ ఇబ్రహీం టెర్రరిస్ట్ కాదని అన్నారు. ముంబై పేలుళ్లతో దావూద్‌కు సంబంధం లేదన్నారు. దావూద్‌కు మమత క్లీన్చిట్ ఇవ్వడంపై సర్వత్రా విమర్శలు వెలువెత్తాయి. అయితే తనకు దావూద్ ఇబ్రహీంతో ఎలాంటి సంబంధాలు లేవన్నారు మమతా కులకర్ణి. జీవితంలో ఎప్పుడు అతడితో కలవలేదన్నారు.
 
      
 
								 
								