వాట్సప్ మరో కొత్త ఫీచర్‌ను అందుబాటులోకి తీసుకురానుంది. సోషల్ నెట్వర్కింగ్ అకౌంట్స్‌లో ఎంతో కీలకమైన “కవర్ ఫోటో” ఫీచర్‌ను వాట్సప్‌లో ప్రవేశపెట్టనుంది. ఫేస్బుక్, లింక్డిన్లో ప్రస్తుతం ఈ ఫీచర్ ఉంది. ఇదే తరహా కవర్ ఫోటో ఫీచర్,త్వరలో వాట్సప్‌లో రానుంది. దీని ద్వారా యూజర్లు ప్రొఫైల్‌లో కవర్ ఫోటోను అప్లోడ్ చేసుకోవచ్చు. వాట్సప్‌లో కవర్ ఫోటోలకు మరింత ప్రైవసీని అందుబాటులోకి తీసుకురానున్నారు. కవర్ ఫోటోలను ఎవరు చూడవచ్చనే విషయంపై యూజర్‌కు కంట్రోల్ ఉంటుంది.

