భారతీయ జనతా పార్టీ (బీజేపీ) నాయకుడు రాజీవ్ చంద్రశేఖర్ రిపోర్టర్ టీవీ చానల్‌పై రూ.100 కోట్లు పరువునష్టం కేసు వేశారు. రిపోర్టర్ టీవీ చానల్ రాజీవ్ చంద్రశేఖర్ పేరు BPL కంపెనీ భూమి లావాదేవీలతో అనవసరంగా కలిపి, తప్పుడు వార్తలు ప్రసారం చేసిందని నోటీసులో పేర్కొన్నారు. నోటీసులో 7 రోజులలోపు ఆ వార్తలను తొలగించి, ప్రజల ముందు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. తనపై వచ్చిన ఆరోపణల్లో నిజం లేదని, BPL కంపెనీ కూడా దీనిపై స్పష్టమైన ప్రకటన ఇచ్చిందని స్పష్టం చేశారు.

