కృష్ణా జిల్లా జిల్లాలోని అవనిగడ్డ నియోజకవర్గంలో తుపాను ప్రభావిత ప్రాంతాల్లో ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఈరోజు పర్యటించారు. తుపాను కారణంగా నష్టపోయిన రైతులను పరామర్శించారు. కోడూరు మండలం కృష్ణాపురం గ్రామంలో నేలకొరిగిన వరి పైరును డిప్యూటీ సీఎం పరిశీలించారు. రైతుల బాధలు విన్న డిప్యూటీ సీఎం.. వారికి ధైర్యం చెప్పారు. రైతులను అన్ని విధాలా ఆదుకుంటామని.. ఎవరూ ఆందోళన చెందవద్దని ఉపముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ భరోసా ఇచ్చారు.

