చారిత్రక ఓరుగల్లుపై మొంథా తుఫాను విరుచుకుపడింది. బుధవారం రోజంతా కుండపోతగా వర్షం కురియడంతో వరంగల్ నగరం జలదిగ్బంధం అయింది. వర్షపు నీరు పలు కాలనీలను ముంచెత్తింది. మొత్తం 45 కాలనీలను వరద నీరు ముంచెత్తింది. నగరం పరిధిలోని 30 కాలనీలు జలదిగ్బంధం అయ్యాయి. హంటర్‌రోడ్డులో బొందివాగు ఉప్పొంగడంతో వరంగల్, హనుమకొండ మధ్య రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. ములుగు వెళ్లే రోడ్డులో నాలాలు ఉధృతంగా ప్రవహిస్తున్నాయి.

