మహారాష్ట్ర బీజేపీ నేత, అమరావతి మాజీ ఎంపీ నవనీత్ రాణాకు బెదిరింపు లేఖ వచ్చింది. స్పీడ్ పోస్టు ద్వారా వారి అమరావతి కార్యాలయ చిరునామాకు వచ్చిన లేఖతో తీవ్ర పదజాలంతో బెదిరింపులకు పాల్పడ్డారు. ఇందులో అత్యంత అసభ్యమైన భాషను ఉపయోగిస్తూ, ప్రాణహాని,సామూహిక దాడి చేస్తామని హెచ్చరించారు. అలాగే, తీవ్ర పరిణామాలకు సిద్ధంగా ఉండండి అంటూ పేర్కొన్నారు. పోలీసుల ప్రాథమిక దర్యాప్తులో, హైదరాబాద్‌కు చెందిన జావేద్ అనే వ్యక్తి ఈ లేఖను పంపినట్లు గుర్తించారు. ప్రస్తుతం అతని జాడను గుర్తించేందుకు విచారణ జరుపుతున్నారు.

