ఛత్తీస్గఢ్లో లొంగిపోయేందుకు మావోయిస్టులు వరుస కడుతున్నారు. తాజాగా బీజాపుర్ జిల్లాలో 51మంది మావోయిస్టులు లొంగిపోయినట్లు పోలీసులు తెలిపారు. వారిలో 9మంది మహిళా సభ్యులు ఉన్నట్లు చెప్పారు. మరోవైపు ఈనెల 26న లొంగిపోయిన కాంకేర్ జిల్లాకు చెందిన 21మంది మావోయిస్టులను పోలీసులు బుధవారం మీడియా ముందు ప్రవేశపెట్టారు. 13మంది మహిళా సభ్యులు, 8మంది పురుషులు ఉన్నారని బస్తర్ IG సుందర్ రాజ్ తెలిపారు. AK-47, SLR, ఇన్సాస్సహా 18ఆయుధాలను అప్పగించి జనజీవన స్రవంతిలో కలిసినట్లు చెప్పారు.

