ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం వైఎస్ఆర్ కడపలోని పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి నివాస గృహం భారీ వర్షానికి కూలిపోయింది. ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలకు పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి నివాస గృహం కుప్పకూలింది. బ్రహ్మంగారి నివాస గృహం కూలిపోవడంపై భక్తుల్లో ఆందోళన చెందుతున్నారు. చారిత్రక నేపథ్యం ఉన్న నివాస గృహం కూలిపోవడం తమ మనోభావాలను దెబ్బతిన్నాయని భక్తులు అవేదన వ్యక్తం చేశారు. పురాతన దేవాలయాలు మరమత్తులు చేపట్టాలని డిమాండ్లు చేస్తున్నారు. పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి మఠం మళ్లీ పునర్ నిర్మించాలని నెటిజన్లు డిమాండ్లు చేస్తున్నారు.

