అమెరికా ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్‌తో జపాన్ ప్రధానమంత్రి సనాయీ తకాయిచీ కీలక విషయాన్ని చెప్పారు. నోబెల్ శాంతి బహుమతికి ట్రంప్‌ను తాను నామినేట్ చేశానని ఆమె వెల్లడించారు. టోక్యోలోని అకాసకా ప్యాలెస్‌లో ట్రంప్‌తో జపాన్ ప్రధానమంత్రి సనాయీ తకాయిచీ భేటీ అయ్యారు. థాయ్‌లాండ్ – కంబోడియా శాంతి ఒప్పందం, చారిత్రక గాజా కాల్పుల విరమణ ఒప్పందం ద్వారా ప్రపంచ శాంతిని ట్రంప్ పెంపొందించారని ఆ సందర్భంగా సనాయీ తకాయిచీ కొనియాడారు. దౌత్యమార్గాల ద్వారా అమెరికా ప్రెసిడెంట్ ప్రపంచ శాంతి స్థాపన చేయడం చాలా మంచి విషయమన్నారు.

