రాజస్థాన్ లో ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు దగ్ధమైంది. ప్రైవేట్ ట్రావెల్స్‌కు చెందిన బస్సు ఉత్తరప్రదేశ్ నుంచి తోడిలోని ఇటుక బట్టీకి కార్మికులను తీసుకెళ్తుంది. బస్సు రన్నింగ్‌లో ఉండగా.. హైటెన్షన్ విద్యుత్ వైర్లు తగిలాయి. దీంతో బస్సంతా ఒక్కసారిగా మంటలు వ్యాపించాయి. కొంత మంది ప్రయాణికులు బస్సుల నుంచి కిందకు దూకేశారు. అప్పటికే బస్సంతా మంటలు వ్యాపించాయి ఘటన స్థలంలోనే ముగ్గురు చనిపోయినట్లు అధికారులు వెల్లడించారు. మరో 15 మంది తీవ్రంగా గాయపడ్డారు.

