మహారాష్ట్ర రెవెన్యూ శాఖ మంత్రి చంద్రశేఖర్ బవంకులే ప్రచార కార్యక్రమంలో మాట్లాడుతూ.. మీ అందరి ఫోన్లు, వాట్సాప్ ఖాతాలపై నిధా పెట్టామని అన్నారు. అంతటితో ఆగకుండా పార్టీకి నష్టం కలిగించే ఏ చిన్న పని చేసినా తమకు వెంటనే తెలిసిపోతుందని.. దానిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఇందుకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అయ్యాయి. తాను చేసిన వ్యాఖ్యలు ప్రజలందరినీ ఉద్దేశించినవి కాదని.. కేవలం భారతీయ జనతా పార్టీ కార్యకర్తలనే తాను హెచ్చరించానని స్పష్టం చేశారు.

