టీటీడీ పరకామణి చోరీ కేసులో మరో ట్విస్ట్ చోటు చేసుకుంది. టీటీడీ అనుమతి లేకుండానే.. అప్పటి ఏవీఎస్వో సతీష్ కుమార్ ఈకేసును లోక్ అదాలత్లో రాజీ చేసుకోవడంపై.. టీటీడీ ఈవో అనిల్ కుమార్ సింఘాల్.. హైకోర్టులో నివేదిక సమర్పించారు. ఈ రాజీకి సతీష్ కుమార్కు అర్హత లేదన్నారు. అలానే ఈ కేసులో పిటిషనర్.. సీఐడీ దర్యాప్తు కోరారని.. ఆ మేరకు క్రమశిక్షణ చర్యలకు సిఫారసు చేశారని ఆయన హైకోర్టుకు తెలిపారు. దీనిపై బోర్డు సమావేశంలో తుది నిర్ణయం తీసుకుంటామని అనిల్ కుమార్ అఫిడవిట్లో నివేదించారు.

