భారత్‌తో జరుగుతున్న మూడవ వన్డేలో ఫస్ట్ బ్యాటింగ్ చేసిన ఆస్ట్రేలియా 46.4 ఓవర్లలో 236 రన్స్ చేసి ఆలౌటైంది. బౌలింగ్‌కు అనుకూలించిన సిడ్నీ పిచ్‌పై భారత బౌలర్లు ఆస్ట్రేలియాను కట్టడి చేశారు. ఇంకా 3.2 ఓవర్లు మిగిలి ఉండగానే ఆసీస్ ఇన్నింగ్స్ ముగిసింది. భారత స్పీడ్ బౌలర్ హర్షిత్ రాణా ఈ మ్యాచ్‌లో నాలుగు వికెట్లు తీసుకున్నాడు. టాస్ గెలిచిన ఆస్ట్రేలియా ముందుగా బ్యాటింగ్ ఎంచుకున్నది. ఆసీస్ బ్యాటర్లలో రెన్షా ఒక్కడే హాఫ్ సెంచరీ స్కోర్ చేశాడు. అతను 56 రన్స్ చేసి ఔటయ్యాడు

