బస్సు దగ్ధం ఘటనలో కాలిబూడిదై 19 మందిని పొట్టనపెట్టుకున్న వేమూరి కావేరి ట్రావెల్స్ బస్సు అక్రమ బాగోతం బయటపడింది. ఆ సంస్థ నిర్వహించిన ఈ బస్సు సీటింగ్ క్యారీయర్యే కానీ స్లీపర్ సర్వీస్ ఎంత మాత్రం కాదు. వాస్తవ పర్మిషన్ విరుద్ధంగా బస్సు ఫిట్నెస్ను మార్చి సీటింగ్ క్యారీయర్ పర్మిషన్ను స్లీపర్ క్యారీయర్గా మార్చేసింది. ఇలా తెలుగు రాష్ట్రాల్లో ట్రావెల్స్ సంస్థలు చేస్తున్న అక్రమ దందా మూలంగా ప్రమాదాలు జరిగినప్పుడు బాధితులకు కనీసం పరిహారం కూడా దక్కడం లేదు.

