మలయాళ సినీ నటుడు మోహన్‌లాల్ కు కేరళ హైకోర్టులో పెద్ద ఎదురుదెబ్బ తగిలింది. ఆయన వద్ద ఉన్న ఏనుగు దంతాల సేకరణను చట్టబద్ధం చేస్తూ ప్రభుత్వం జారీ చేసిన ఉత్తర్వులను హైకోర్టు రద్దు చేసింది. మోహన్‌లాల్ పేరుతో జారీ చేసిన లైసెన్స్ కూడా కోర్టు చెల్లనిదిగా ప్రకటించింది. వన్యప్రాణుల సంరక్షణ ప్రభుత్వం చట్టపరమైన విధానాలను పాటించాలి అని కోర్టు సూచించింది. 2011లో మోహన్‌లాల్ నివాసంలో ఆదాయపు పన్ను శాఖ అధికారులు సోదాలో ఆయన ఇంట్లో రెండు జతల ఏనుగు దంతాలు లభించాయి.

