
ఏఐ వచ్చి ఇప్పటికే చాలా ఉద్యోగాలను సొంతం చేసేసుకుంది. దిగ్గజ కంపెనీల్లో ఒకటైన అమెజాన్ కూడా ఈ ఏడాది భారీగా ఉద్యోగాలను పీకిపారేసింది. అమెజాన్ ఆటోమేషన్ బృందం దీనిపై పని చేస్తోంది. నెమ్మదిగా మనుషుల స్థానంలో రోబోలను పనిలోకి తీసుకువస్తోంది. 2027 నాటికి అమెరికాలో 1, 60,000 కంటే ఎక్కువ మందిని ఉద్యోగాలను తప్పించడం లేదా..నియమించకుండా ఉండేందుకు అమెజాన్ ఆటోమేషన్ బృందం పని చేస్తోంది. ఇది 2033 నాటికి దాదాపు 6లక్షల రోబోలు అమెజాన్లో పని చేస్తాయని చెబుతున్నారు.