భారత మేటి జావెలిన్ త్రోయర్, ఒలింపిక్ పతక విజేత నీరజ్ చోప్రాకు అరుదైన గౌరవం దక్కింది. జావెలిన్ సూపర్ స్టార్ నీరజ్ చోప్రాకు భారతీయ ఆర్మీలో గౌరవప్రదమైన లెఫ్టినెంట్ కల్నల్ ర్యాంక్‌ను అందజేశారు. ఢిల్లీలోని సౌత్ బ్లాక్‌లో ఆయన్ను ఆ ర్యాంక్‌తో సన్మానించారు. రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్, చీఫ్ ఆఫ్ ఆర్మీ స్టాఫ్ జనరల్ ఉపేంద్ర ద్వివేది ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. నీరజ్ చోప్రా కుటుంబం కూడా ఈ ఈవెంట్‌ను ప్రత్యక్షంగా వీక్షించింది.

