
ఆఫ్రికా దేశం ఉగాండాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. రెండు బస్సులు ఢీకొన్న ఘటనలో 63 మంది మరణించారు. ఓవర్ టేకింగ్ చేస్తున్న సమయంలో ఈ ప్రమాదం జరిగినట్లు తెలుస్తోంది. కిరియాన్డోంగో జిల్లాలోని కంపాలా – గులా హైవేపై ఈ ప్రమాదం జరిగింది. మంగళవారం రాత్రి ఈ దర్ఘటన జరిగింది. చెయిన్ రియాక్షన్లో పలు వాహనాలు ధ్వంసం అయ్యాయి. అనేక మంది గాయపడ్డారు. రెండు బస్సుల్లో ఉన్న ప్రయాణికులు అందరూ ప్రాణాలు కోల్పోయారు.