
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ పుట్టినరోజు సందర్భంగా అభిమానులకు గిఫ్ట్‌గా హను రాఘవపూడి సినిమా టైటిల్ టీజ్ పోస్టర్ విడుదలైంది. స్టైలిష్ లుక్‌లో ప్రభాస్ బ్రిటిష్ జెండాతో కప్పబడిన నేలపై నడుస్తూ కనిపించాడు. “1932 నుండి మోస్ట్ వాంటెడ్”, “ఒంటరిగా నడిచే ఒక బెటాలియన్” లైన్స్ పోస్టర్లో ఆసక్తి రేపాయి. ఈ సినిమా ప్రభాస్ కెరీర్లో మరో క్రేజీ ప్రాజెక్టుగా మారబోతోంది. ఈ పోస్టర్ క్షణాల్లో తెగ వైరల్‌గా మారింది.