
ప్రపంచ వ్యాప్తంగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ప్రభావంతో టెక్ రంగంలో ఉద్యోగులను తొలగిస్తున్నారు. అయితే దిగ్గజ ఐటీ సంస్థ మైక్రోసాఫ్ట్ సీఈవో సత్య నాదెళ్ల వేతనం ఈ ఏడాది ఏకంగా 22 శాతం పెరిగింది. మైక్రోసాఫ్ట్ సీఈవో సత్యనాదెళ్ల కొత్త వేతనం 96.5 మిలియన్ డాలర్లు. భారత కరెన్సీలో ఇది సుమారుగా రూ.847 కోట్లు. గత ఏడాది సత్యనాదెళ్ల వేతనం 79 .1 మిలియన్ డాలర్లుగా ఉన్నది. వేతనంలో ఎక్కువ భాగం 84 మిలియన్లకు పైగా విలువైన స్టాక్ అవార్డుల రూపంలో లభిస్తుంది.