
జేఎన్టీయూ<span;>(JNTU)లో పీహెచ్డీ సీట్ల సంఖ్య పెంపునకు కొందరు ఉన్నతాధికారుల నుంచి మద్దతు లేకపోవడంతో, గతంలో ప్రకటించిన 213 సీట్లకు మాత్రమే అభ్యర్థులను ఎంపిక చేయాలని, ఈ మేరకు వెరిఫికేషన్ ప్రక్రియను నెలాఖరులోగా ప్రారంభించాలని వీసీ కిషన్‌కుమార్ రెడ్డి నిర్ణయించారు. వాస్తవానికి గత నెల 12 నుంచి 14 వరకు నిర్వహించిన ప్రవేశపరీక్షలో సుమారు 650మంది అభ్యర్థులు అర్హత సాధించారు. సీట్ల సంఖ్య పెరిగితే ఎక్కువమంది అభ్యర్థులకు పరిశోధనలు చేసేందుకు వీలుండేది.