
హరీష్ బేషరతుగా క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. కేబినెట్ మంత్రులను దండుపాళ్యం బ్యాచ్ అంటారా అంటూ ఫైర్ అయ్యారు. కేబినెట్లో జరగని విషయాలను జరిగాయని ప్రచారం చేయడం దుర్మార్గమని మండిపడ్డారు. ‘సిద్దిపేట వెంకటేశ్వర ఆలయంలో ప్రమాణం చేద్దామా? హరీష్ సెంటిమెంట్‌గా భావించే దేవుడిపై ప్రమాణం చేయగలడా? ఇద్దరం తడిబట్టలతో ప్రమాణం చేద్దామా? ఛాలెంజ్‌ను హరీష్ స్వీకరించాలి. కొండా సురేఖ బిడ్డ.. మా అందరికీ బిడ్డ లాంటిదే’ అంటూ మంత్రి అడ్లూరి పేర్కొన్నారు.