జూన్‌లో అమెరికా దాడుల వల్ల ఇరాన్‌లోని అణు కేంద్రాలు ధ్వంసమయ్యాయని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చేసిన వాదనలను ఇరాన్ సుప్రీం నాయకుడు అయతుల్లా అలీ ఖమేనీ సోమవారం తోసిపుచ్చారు. తన అధికారిక వెబ్సైట్లో ఒక ప్రకటనలో ఖమేనీ ట్రంప్‌ను ఉద్దేశిస్తూ.. సైట్ల విధ్వంసంపై వ్యాఖ్యలపై “కలలు కంటూ ఉండండి” అని అన్నారు. “ఒక దేశం అణు పరిశ్రమను కలిగి ఉండాలా? లేదా అని చెప్పే హక్కు అమెరికాకు ఎక్కడిదని ఆయన ప్రశ్నించారు.

