కాంగ్రెస్ నేత జీవన్ రెడ్డి మరోసారి అసహనం వ్యక్తం చేశారు. దశాబ్దాల నుంచి కాంగ్రెస్ పార్టీ కోసం పనిచేస్తున్న వారికి కాకుండా.. బీఆర్ఎస్ నుంచి పార్టీలో చేరిన వారికి పదవులు ఇస్తున్నారని మండిపడ్డారు. శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారి నూతన కమిటీ నియామకంపై అసంతృప్తి వ్యక్తం చేశారు. ఒక పెంబట్ల దేవాలయం కమిటీ తప్ప అన్ని దేవాలయ కమిటీలను బీఆర్ఎస్ నుంచి వచ్చిన నాయకులకే ఇచ్చారని పేర్కొన్నారు. పొలాస పౌలస్తేశ్వర స్వామి ఆలయ కమిటీ సభ్యులుగా చొప్పదండి మాజీ ఎమ్మెల్యే అనుచరుడికి ఇచ్చారని అన్నారు

