
చంద్రగిరి మండలం కొంగరవారిపల్లి జడ్పీ హైస్కూల్ లో చదువుతున్న ఒక విద్యార్థి.. లిక్కర్ సేవించినట్లు స్కూల్ బ్యాగ్ లో పుస్తకాలతో పాటు లిక్కర్ బాటిల్ ఉన్నట్లు గుర్తించారు. విషయాన్ని పాఠశాల హెడ్మాస్టర్ దృష్టికి టీచర్ తీసుకెళ్లాడు.
హెడ్మాస్టర్ వెంటనే తల్లిదండ్రులకు స్కూలుకు రావాలని సమాచారం ఇచ్చారు. మద్యం తాగిన విషయం తల్లిదండ్రులకు తెలుస్తుందన్న భయం స్టూడెంట్ రైలు కింద పడి ఆత్మహత్య చేసుకున్నట్టు గుర్తించిన స్థానికులు.. పోలీసులకు సమాచారం ఇచ్చారు.