
‘ఈపీఎఫ్ఓ ఇటీవల తెచ్చిన కొత్త రూల్స్ చాలా క్రూరంగా ఉన్నాయి. ముఖ్యంగా పింఛనుదారులు, ఉద్యోగం కోల్పోయిన వారికి తమ డబ్బులు అందకుండా చేస్తున్నారు. పీఎఫ్ పాక్షిక ఉపసంహరణలకు సంబంధించిన గడువు పెంచడంపై మండిపడుతున్నాయి. పీఎఫ్ ముందస్తు విత్ డ్రా గడువును 2 నెలల నుంచి 12 నెలలకు పెంచడం, ఈపీఎస్ మొత్తం విత్ డ్రా చేసేందుకు సమయాన్ని సైతం 2 నెలల నుంచి 36 నెలలకు పెంచడం ఈ రూల్స్‌ను వెంటనే వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నాయి.