
బిహార్ శాసనసభ ఎన్నికల్లో పోటీచేసే అభ్యర్థుల రెండో జాబితాను బీజేపీ బుధవారం విడుదల చేసింది. మొత్తం 12 మందితో రెండో జాబితా విడుదల చేయగా.. వీరిలో ప్రముఖ జానపద గాయని మైథిలీ ఠాకూర్, మాజీ ఐపీఎస్ అధికారి ఆనంద్ మిశ్రాలకు అవకాశం కల్పించింది. సింగర్ మైథిలీ అలీనగర్ నుంచి, ఆనంద్ మిశ్రా బక్సార్ నుంచి పోటీచేయనున్నారు. ఈ జాబితాలోని 12 మందిలో 9 మంది కొత్త ముఖాలు కావడం విశేషం.