ఆంధ్రప్రదేశ్ స్టేట్ బెవరేజెస్ కార్పొరేషన్ (APSBCL) ఆధ్వర్యంలో అమలవుతున్న ఈ నిబంధనలు అక్టోబర్ 13 నుంచి రాష్ట్రవ్యాప్తంగా దశలవారీగా అమలు చేస్తున్నారు. కొత్త రూల్స్ ప్రకారం క్యూఆర్ కోడ్ స్కానింగ్ తప్పనిసరి చేశారు. ప్రతి మద్యం బాటిల్‌పై జియో-ట్యాగ్ చేసిన క్యూఆర్ కోడ్ ఉంటుంది. షాపుల్లో అమ్మే ముందు ఈ కోడ్‌ను స్కాన్ చేయాలి. మద్యం షాపుల లైసెన్స్ హోల్డర్లు స్కానింగ్ ప్రక్రియను అనుసరించకపోతే, లైసెన్స్ రద్దు, జరిమానాలు విధిస్తారు. జియో-ట్యాగింగ్ వల్ల బాటిళ్లు నిర్దేశిత ప్రాంతాల్లో మాత్రమే విక్రయించాల్సి ఉంటుంది.

